శ్రీ రామ
జయ హనుమాన్
శ్లో|| హనుమాన్ కల్పవృక్షో మే – హనుమాన్ మమ కామధుక్
చింతామణి స్తు హనుమాన్ – కో విచారః? కుతో భయమ్?
శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఎట్టి విచారము, భయము ఉండదు. “దేవో భూత్వా దేవం యజేత” అన్నారు. ఏ దేవుని అనుష్టింపదలచినవారు ఆ దేవతతో తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ఆ దేవుని పరిపూర్ణానుగ్రహం పొందగల్గుతారు. అందుకు అనువైన మార్గం దీక్ష. “సర్వం హనుమన్మయం జగత్” జగమంతా జీవనమంతా హనుమన్మయంగా దీక్షాకాలంలో ఉండి హనుమంతునితో మనం తాదాత్మ్యం పొంద గల్గుతాము. అట్టి తాదాత్మ్యత దీక్షానంతర కాలమందు కూడ క్షణములో హనుమత్స్వామిని మనసుకు తెచ్చుకొని హనుమదనుగ్రహాన్ని పొందగల్గుటకు హేతుభూత మౌతుంది. అది సంస్కారంగా మనలో నిలిచి పోతుంది. అందుకే చిరకాలంగా భక్తులచే హనుమద్దీక్షలు స్వీకరింపబడుచున్నాయి.
హనుమంతుని పూజించిన సకలదేవతలను పూజించిన సకలదేవతలను పూజించినట్లే. “ఆంజనేయః పూజితశ్చేత్ పూజితా స్సర్వదేవతాః” అన బ్రహ్మదేవుడే చెప్పాడు. హనుమంతుడు చిరంజీవి. ఆయన నామస్మరణ ఆయుర్వృధ్ధికరం. ఆయన సంజీవరాయుడు. సర్వవ్యాధులు తొలగింపగల ఆరోగ్య ప్రదాత. ఐహికాముష్మికములు రెండూ హనుమత్స్వేవకులకు కరతలామలకము లని శౌనకమహాముని, కల్పవృక్షసముడగు హనుమంతుడు కోరిన కోర్కెల నెల్ల తీర్చగలడని పరాశరమహర్షి చెప్పారు.
దీక్షా గురువుగా సంస్కారవంతులగు హనుమదుపాసకులనుగాని, హనుమ న్నిత్యసేవకులగు హనుమదాల యార్చకులనుగాని, ఐదేండ్లు దీక్ష స్వీకరించినవారినిగాని స్వీకరించినవారినిగాని స్వీకరింపదగును. దీక్షా నియమము పాటింపగ వారెల్లరు హనుమద్దీక్ష స్వీకరించుటకు అర్హులే.
శ్రీ హనుమాన్ దీక్ష అవలంబించు విధానము, పాటించు నియమములు మరియు దీక్షకు సంబంధించిన చాలా విషయములు ఈ క్రింది గ్రంధములోను, వీడియోలలోను వివరముగా తెలుపబడినవి. హనుమత్ భక్తులు గ్రంధమును చదివి, వీడియోలను చూసి తెలిసికొన ప్రార్థన.
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి
[wp_campaign_1]
[dm]3[/dm]
Be First to Comment