ఆత్మీయ బంధువులారా!
ఈ సంవత్సరము 4th June, 2021 శుక్రవారము నాడు శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా, హనుమత్ భక్తులందరికీ శుభాకాంక్షలు.
వైశాఖేమాసి కృష్ణాయాం- దశమీ మందసంయుతా
పూర్వప్రోష్టపదా యుక్తా – తథా వైధృతిసంయుతా
తస్యాం మధ్యాహ్నవేళాయాం – జనయామాస వై సుతమ్
శ్రీపరాశర సంహిత 6వ పటలమునందు హనుమజ్జన్మ కథనం వివరింపబడినది.
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమునందు,వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.
వానర రాజు కేసరి భార్యయగు అంజన గొప్ప బలవంతుడగు పుత్రుని పొందుటకు వెంకటాద్రి పర్వతము మీద గొప్ప తపస్సు చేసెను. వాయుదేవుడు పార్వతీ పరమేశ్వరుల తేజస్సును ఒక ఫలరూపముగా ఆమెకు అందచేసెను. ఆ ఫలితముగా అంజనకు వైశాఖ మాసమున కృష్ణపక్షమున దశమీతిథి శనివారం పూర్వాభాద్ర నక్షత్ర వైధృతి యోగమున మధ్యాహ్న సమయమున మహా బల సంపన్నుడు, విష్ణుభక్తి కలవాడు, మాణిక్యకుండలములను, దివ్యమగు పట్టువస్త్రములను, స్వర్ణమయమగు జందెమును ధరించినవాడు, ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము అను రేఖలతో కూడిన పాదములు, పొడవగు తోక, గొప్ప దేహము కల హనుమ జన్మించెను.
ఆ హనుమంతుని ఆశీర్వాదములు మన అందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…
జయ హనుమాన్| జయ జయ హనుమాన్ ||
రమేష్ చంద్ర అడివి
Mobile/Whatsapp: (+91) 770 222 1997
Be First to Comment