Press "Enter" to skip to content

Sri Hanumath Shatakam – శ్రీ హనుమచ్చతకము (చిత్ర కవిత్వము)

Sri Hanumath Shatakam

శ్రీ రామ
జయ హనుమాన్

కృతజ్ఞతలు

డా. కె.వి.కె.సంస్కృత కళాశాల, గుంటూరు విద్యార్థిగా ఉన్న దశలో వ్రాసిన దీశతకం. శ్రీ హనుమంతుని దయవలన నాకు హైస్కూలులో చదువుకునే రోజులలోనే ఛందోబద్ధమైన కవిత్వం అబ్బింది. ఉద్యోగిగా ఆరంభ దశలో సంఘ సేవానిరతుడనయి, అనంతరం ఆధ్యాత్మిక మార్గ గతుడనయి, కవితా మార్గము నుపేక్షించినాను. శ్రీ హనుమంతుడు నాచే ఏది చేయింపదలచినా దానికే నేను సిద్ధమై ఉన్నాను.

హనుమత్సేవలో చాలా సాహిత్యం వెలువరించాను. గ్రంధములన్ని ఏకకాలంలో పునర్ముద్రణకై ఎదురుచూచే దశలో శ్రీ హనుమంతుడు నాకు వరంగా బ్రహ్మశ్రీ ధారా సత్యనారాయణశాస్త్రి సిద్ధాంతిగారి సహాయాన్ని చూపాడు. హనుమద్భక్త శిఖామణి అయిన శ్రీ శాస్రిగారు నా హనుమత్సాహిత్యమంతనూ వెలుగులోకి తెచ్చుటలో కఠి బధ్ధులై సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నా చిన్ననాటి రచనను అందిస్తున్నాము. ఈ గ్రంధ ముద్రణకు ద్రవ్య సహాయము గావించిన శ్రీ ధారా సత్యనారాయణశాస్త్రి గారికి కృతజ్ఞతలు. ఈ నా శతకమునకు తమ ఆశీస్సులు అందించిన నా గురుదేవులు కీ.శే. చతుర్వేదుల సత్యనారాయణ, జమ్మలమడక మాధవశర్మ గార్లకు ప్రణామములు. దీనిని చక్కగా ముద్రించి ఇచ్చిన శ్రీ బి.వి.యన్. శాస్త్రిగారికి కృతజ్ఞతలు. దీనిని ఆదరించు పాఠకులకు నమస్కృతులతో……

ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి

ఇందులో

73వ పద్యమంతా ఒకే అక్షరంతో నడిచింది. 78వ, 79వ పద్యాలు రెండు అక్షరాలతోనే నడిచాయి. 37వ, 62వ పద్యాలు గర్భ కవిత్వం. బంధకవిత్వాదులతోపాటు ఆరంభాక్షరాలు ముందునుండి, వెనుకనుండి, కృతిభర్త, కృతికర్తలను సూచిస్తాయి. ఇలా ఎన్నో చిత్ర విధులు ఇందులో కానవస్తాయి. విభీషణకృత శ్రీ హనుమద్బడబానల స్తోత్రముకూడ చివరలో అందింపబడినది. సాంతం చదవండి. హనుమంతుడు చిత్రగతుడు కాబట్టి ఆ చమత్కృతులతో ఆనందించండి. హనుమదనుగ్రహాన్ని పొందండి – ప్రకాశకులు

[wp_campaign_1]

The Sri Hanumath Shatakam – శ్రీ హనుమచ్చతకము (చిత్ర కవిత్వము) book is available online in PDF format and it can be downloaded from our website. – Admin

[dm]1[/dm]

Sri Hanumath Shatakam

Sri Hanumath Shatakam

Sri Hanumath Shatakam

Sri Hanumath Shatakam

The Sri Hanumath Shatakam – శ్రీ హనుమచ్చతకము (చిత్ర కవిత్వము) book is available online in PDF format and it can be downloaded from our website – Admin

[dm]1[/dm]

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: