శ్రీ రామ
జయ హనుమాన్
శ్రీ హనుమన్నవావతార చరిత్ర
పూర్వజన్మ వాసనల పుణ్యమా అని నాకు హనుమంతునియందు భక్తి కుదిరింది. ఆబాల్యంగా ఆయనను సేవిస్తూ వచ్చాను. మంచి సేవకునిగా స్వామి గుర్తించాడు కాబోలు. కొన్నివేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత (ఆంజనేయ చరిత్ర) మహాగ్రంధాన్ని వెలుగులోకి తెచ్చే మహత్తరావకాశం నాకు లభించింది.
తన సాహిత్య సేవకు ఒక మంచి వేదిక నందిస్తూ ది.3-4-1982 న మహర్షి సత్తములు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారి కరకలములచే నా స్వగ్రామమైన ఆరేపల్లి అగ్రహారంలో శ్రీ హనుమదాధ్యాత్మిక కేంద్రమును హనుమత్ స్వామి స్థాపింపజేశాడు.
శ్రీ పరాశరసంహిత గ్రంధంమాత్రం వెలుగులోకి తెస్తే కార్యం పూర్తి కాదనిపించింది. ఆ ఉద్గ్రంధం చూపిన మార్గంలో శ్రీ హనుమంతునకు గల తొమ్మిది అవతారాలకు రూపకల్పనచేసి విగ్రహాలు నిర్మింపజేస్తే రాబోవు కాలంలో వానికి ఆలయాలు ఏర్పాటు కావచ్చని బుధ్ది పుట్టింది. చిరకాలంగా నాలో ఉన్న హనుమదాలయ నిర్మాణ సమాలోచనకు సదవకాశం వచ్చింది.
1983లో స్థలం సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది. 26-08-1984న కర్షణము, 02-08-1984న శంకుస్థాపనము గావించాను. భక్తకోటి సహాయ సహకారాలతో ఆలయం చక్కగా రూపుదాల్చింది. నవావతారమూర్తుల ప్రధానమూర్తి, పూర్ణ రుద్రావతారమయిన శ్రీ పంచముఖాంజనేయ స్వామికి యంత్రోధ్ధార,మంత్రానుష్టానములు జరిపి ద్.02-06-1983న నా చేతులమీదుగా ప్రతిష్టించుకొని ధన్యుడనైనాను.
ది.18-05-1989న మిగిలిన హనుమదవతారాలతోబాటు శ్రీ గాయత్రీమాతను ప్రతిష్టించుకొని ధన్యుడనైనాను. మహాక్షేత్రంగా రూపుదిద్దుకొంటున్న ఒంగోలు సుందరనగరంలోని ఆ దేవాలయాన్ని మీరు చూచి తీరవలసిందే. ఇంతటి మహత్కార్యం ఎందరో మహనీయుల సహాయ సహకారాలు అందితేనే జరిగింది. వారందరి పేర్లు ఉదహరించుట కష్టసాధ్యం. వారందరకు కలకాలముగా నేను కృతజ్ఞుడను.
[wp_campaign_1]
శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము
శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
శ్రీ వింశతిభుజ ఆంజనేయస్వామి అవతారము
శ్రీ పంచముఖాంజనేయస్వామి అవతారము
శ్రీ అష్టాదశభుజ ఆంజనేయస్వామి అవతారము
శ్రీ సువర్చలాంజనేయస్వామి అవతారము
శ్రీ చతుర్భుజాంజనేయస్వామి అవతారము
శ్రీ ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి అవతారము
శ్రీ వానరాకార ఆంజనేయస్వామి అవతారము
చాలామందికి హనుమంతునకు తొమ్మిది అవతారములున్నయనే విషయమే తెలియదు. కాబట్టి వారందరికోసం ఆస్వామి అవతారాలచరిత్ర అందింప బడుతోంది. పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగోరుచున్నాను.
శ్రీ హనుమన్నవావతార చరిత్రను (Sri Hanumannavaavatara Charitra) పూర్తిగా తెలుసుకొనుటకు, గ్రంధమును పొందుటకు మీరు మా హనుమత్పీఠమును సంప్రదించగలరు.
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి
Be First to Comment