Press "Enter" to skip to content

10th May, 2018 గురు వారము – శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

JayaHanuman2018

ఆత్మీయ బంధువులారా!

ఈ సంవత్సరము 10th May, 2018 గురు వారము నాడు శ్రీ హనుమజ్జయంతి సందర్భముగా, హనుమత్ భక్తులందరికీ, జయహనుమాన్ జీ website వీక్షకులందరికీ శుభాకాంక్షలు.

హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.

శ్రీ హనుమంతుని అనుగ్రహం సంపాదించుకొని ఇహపరములను సాధింపవలె ననునదే భక్తులగువారి ఆకాంక్ష. అట్టి అనుగ్రహ సంపాదనలో మార్గాలనేీకాలు ఉన్నాయి. ఎక్కువ నియమములు కల్గిన తపస్సు లేక మంత్రానుష్టానము సాధారణ భక్తులకు సాధ్యమైనదికాదు. సధ్గురు ననుగ్రహం లభించి మంచి సమయంలో తద్గురూపదేశమంది ఏకాగ్రతతో సాధన చేయాలి. అంతటి ప్రయాసలు లేక ఎల్లరకు సులభసాధ్యమైన మార్గం స్తోత్ర పఠనం.

స్తుతిప్రియులు కానివా రుండరు. దేవతలు స్తోత్రప్రియులు. చక్కగా స్తుతించి వారి యనుగ్రహం పొందగల్గుట యెల్లరకు అనుకూలమైన మార్గం. ముఖ్యంగా హనుమంతుడు పొగిడిన పెరిగెడి స్వామి. హనుమదనుగ్రహ సంపాదనకు మంచి సాధనముగా  శ్రీ హనుమత్ స్తోత్ర కదంబము (శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి సమర్పణ) నందు ప్రచురింపబడిన శ్రీ హనుమత్ త్రికాలధ్యానం మరియు శ్రీఆదిశంకరకృత హనుమత్ స్తోత్రంలను భక్తుల కొరకు అందజేస్తున్నాము.

 

శ్రీ హనుమత్ త్రికాలధ్యానం
(ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములందు హనుమద్భక్తులు క్రమముగ పఠింపవలెను)

ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం
శ్రీరామచంద్ర చరణాంబుజ చంచరీకం
లంకాపురీ దహన నందిత దేవబృందం
సర్వార్థసిద్ది సదనం ప్రథిత ప్రభావమ్||

మాధ్యం నమామి వృజినార్ణవ తారణైకా
ధారం శరణ్య ముదితానుపమ ప్రభావం
సీతాధి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్పతరు మవ్యయ మాంజనేయమ్||

సాయం భజామి శరణోపసృతాఖిలార్తి
పుంజ ప్రణాళన విధౌ ప్రథిత ప్రతాపం
అక్షాంతకం సకల రాక్షస వంశధూమ
కేతుం ప్రమోదిత విదేహసుతం దయాళుమ్||


శ్రీఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం
(ఈ శంకరాచార్య కృతమగు స్తోత్రము నిత్యము పఠించిన చిరకాలము ఐహిక సుఖములనుభవించి పరమున ముక్తినందగలరు)

వీతాఖిల విషయేచ్చం – జాతానం దాశ్రుపులక మత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం – వాతత్మజ మద్య భావయే హృద్యమ్||

తరుణారుణ ముఖకమలం – కరుణారసపూర పరితాపాంగం
సంజీవన మాశాసే – మంజుల మహిమాన మంజనా భాగ్యమ్||

శంబరివైరి శరాతిగ – మంబుజదల విపుల లోడనోదారం
కంబుగళ మనిలదిష్టం – బింబజ్వలతోష్ట మేక మవలంబే||

దూరీకృత సీతార్తిః – ప్రకటీకృత రామవైభవ స్పూర్తిః
దారిత దశముఖకీర్తిః – పురతో మమ భాతు హనుమతో మూర్తిః||

వానర నికరాధ్యక్షం – దానవకుల కుముద రవికర సదక్షం
దీనజనావన దీక్షం – పవన తపఃపాక పుంజ మద్రాక్షం||

ఏత త్పవనసుతస్య – స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యం
చిర మిహ నిఖిలాన్ భోగాన్ – భుక్త్వా శ్రీరామభక్తి భాగవతః|

ఆ హనుమంతుని ఆశీర్వాదములు మన అందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…

జయ హనుమాన్| జయ జయ హనుమాన్ ||

 

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: