శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను.
శ్రీ పరాశరసంహిత (Sri Parasara Samhita) ప్రతిహనుమద్భక్తునకూ అందాలి. అందుకోసం ఏ భాగమూ లోటులేని రీతిగా చేయాలనే సత్సంకల్పం కల్గింది.
మొత్తం 18 పారిజాతాలనూ మూడుసంపుటాలలోకి తేవాలని నిశ్చయించాను. 40 పటలాల మొదటిసంపుటాన్ని వెలువరించి ఉన్నాను. మరో 40 పటలాలతో రెండవ సంపుటాన్ని ఇలా అందిచగల్గుచున్నందుకు సంతసించుచున్నాను. స్వామి దయవలన అనతికాలంలో మూడవసంపుటాన్ని స్వామి పాదాలకడ ఇలా చేర్చగోరుచున్నాను. ఇలా కల్పవృక్షం క్రింద ఉన్నా కోరుకొంటేనే కోర్కెలు తీరుతాయి. హనుమంతుడు భక్తసులభుడైనా ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గంలో నడవాలి. అట్టి మార్గాలన్నీ ఈపరాశరసంహితయందే ఉన్నాయి. కాబట్టి దీనిని స్వీకరించి పఠించి కర్తవ్యాల నాచరించుటద్వారా శ్రీహనుమంతుని సంపూర్ణ అనుగ్రహాన్నీ పొంది ఇహపర సాధకులు కాగలందుకు భక్తపాఠకతతిని కోరుచున్నాను.
మూల్యముః 200.00
Be First to Comment