గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక
సంపాదకీయం
నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.
[wp_campaign_1]
గురువు అంటే తండ్రి అని కూడా అర్థం. అలా గురువవటమే కాదు. స్వయంగా విద్యచెప్పిన గురువు, మంత్రోపదేశంచేసిన గురువుకూడా. కాబట్టి ఇది నూటికి నూరుపాళ్ళ గురుసేవే, గురు ప్రకాశనమే. నేనేకాదు. మా నాన్నగారికి అనుంగు శిష్యులు ఎందరో ఉన్నారు. పదవి విరమణ సమయంలో పూర్వ, ప్రస్తుత విద్యార్థులంతా కలిసి వారిని రథంపై కూర్చుండబెట్టి బండిని స్వయంగా మోశారు. ఇలా సర్వేపల్లి రాధాకృష్ణ పండితునకు జరిగినదని విన్నాం. ప్రత్యక్షంగా మా నాన్నగారికి జరగటం చూశాం. అంతటి భక్తి గలవారిని ఆలోచనలోకి తీసికొనటం మంచిదని ముఖ్యులతో సంప్రదించి నాన్నగారికి షష్టిపూర్తి నిర్వహణకు, ఆసందర్భంగా ‘గురుప్రకాశనము’ అనే ప్రత్యేక సంచిక వెలువరించటానికి పూనుకొన్నాను. అందుకు చాలామంది చేదోడు వాదోడు కావటం నా అదృష్టం.
జీవితంలో ప్రతిక్షణం ధన్యం చేసికోవాలని కోరుకొని అలా యత్నించేవారి జీవితం ప్రతివ్యక్తికి ఆదర్శంగా స్వీకరింప దగినదే. చిన్నతనంనుండే ఎన్నో రంగాలలో గణనీయమయిన కృషిచేసి O.Y.P. అవార్డు నందుకొన్న నాన్నగారు అదే వేగంతో ఈనాటిదాకా బహుముఖంగా కృషిచేస్తూనే ఉన్నారు. అటువంటి సాధకుల జీవితంలో ప్రతివారికి కొంత సందేశం లభించవచ్చు. ముఖ్యంగా నాన్నగారి శిష్యగణానికిది చాలాముఖ్యమైనది. వివిధ కోణాలలో విస్తరించిన నాన్నగారి కృషిని గ్రహించి అది ఆదర్శంగా ప్రతివారూ తమవంతు ఉత్తమకృషి గావిస్తూ క్షణభంగురమయిన జీవితాన్ని ధన్యం చేసికొనవచ్చు. అందుకే ఈ యత్నం శ్రేయస్కరమయినదిగా భావిస్తున్నాను.
రిటైరు కాకముందు, అయాక కూడా విశ్రాంతిని కోరకుండ నిద్రాహారాలయెడ శ్రధ్దకూడా చూపకుండా పనిచేస్తున్నారు. ఏంచేస్తున్నారు? ఏం సాధించారు? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సంచిక నిలుస్తోంది. జీవితాన్ని ఇంతగా ధన్యం చేసుకొంటున్న మా నాన్నగారు సమాజానికి తప్పక ఆదర్శంగా చూపదగినవారనిపించింది. అందుకే ‘గురుప్రకాశనము’ ప్రత్యేక సంచిక వెలువరించటానికి సాహసించాను. నా ప్రార్థనను మన్నించి తమ ఆశీస్సులందించిన పీఠాధిపతులకు, సాధుసంతులకు, బంధువలకు, పండితులకు, ఆత్మీయులకు పేరుపేరున కృతజ్ఞతలు తెల్పుకొంటున్నాను. చక్కగా ముద్రించి యిచ్చిన శ్రీ బి.వి.స్.శాస్రిగారికి, శ్రీ పి.వి.జి. భాస్కర్ గారికి, ఇతర ప్రత్యక్ష్య పరోక్ష సహకారులకు కృతజ్ఞతలు తెలియజేసికొంటున్నాను. అందరూ నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఒక్కమారు దీనిని చదువుటద్వారా నా కృషిని ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.
విధేయుడు
ఎ.వి.న్.జి. హనుమత్ప్రసాద్
[wp_campaign_2]
We have proud to inform you that the “Guruprakashanam” book is available online in PDF format and it can be downloaded from our website. The book has been made into 4 parts and the download links are:
[wp_campaign_3]
[dm]6[/dm]
[dm]7[/dm]
[dm]8[/dm]
[dm]9[/dm]
Be First to Comment