మహనీయం – డా. అన్నదానం చిదంబరశాస్త్రి
(ఋషిపీఠం డిసెంబరు, 2014 నందు ప్రచురించబడిన ఆర్టికల్ – Article published in Rushipeetham December, 2014 Monthly Magazine)
“మనది సనాతన మతమండీ! దానికి చావులేదు. మనమేం చేయనవసరం లేదు” అని కొందరంటారు. నిజమే మనది సనాతన మతమే! చచ్చే ప్రమాదం లేనంతమాత్రాన ఒంటిచీడ, తలనొప్పి, పిచ్చి, బలహీనత వంటి బాధలకు చికిత్స చేసుకోకుండా కూర్చుంటామా? చిన్న వ్యాధులని వదలి పెడితే క్రమంగా అవే ప్రాణాంతక స్థితిని తెస్తాయి. కాబట్టి తప్పక చికిత్స చేసుకొంటాం.
అలాగే ధర్మమునకేర్పడిన జాడ్యాలను కూడా వదలి పెట్టకుండా వదలించాలి. రోగాలను పోగొట్టుకోవాలి. బలాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే ఆనందంగా జీవించగలం. కాబట్టి మన మంచి ప్రయత్నాన్ని విరమింప జేసే ఎటువంటి ప్రయత్నాలకు లొంగి ఆగిపపోక ముందుకు నడుద్దాం. ధర్మాన్ని రక్షించుకుందాం. ధర్మస్థాపకుడైన భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం.
- ధర్మాన్ని గురించి తెలుసుకొనడం
- వాటిని ఆచరించడం
- ధర్మాన్ని తెలియని వారికి తెలియజెప్పడం
- ధర్మానికేర్పడుతున్న సంకట పరిస్ఠితులను అర్థం చేసుకొని తెలియని వారికి తెలియ జెప్పడం
- మన కుటుంబంలో, తోటివారిలో ధర్మాచరణకు ప్రోత్సహించడం
ఈ ఐదు విషయాలను అనుసరిస్తే ధర్మకార్యం పూర్ణంగా చేసినట్లే.
Source: Rushipeetham, Dec 2014 Monthly Magaine
Be First to Comment