శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.
లోకానుగ్రహంతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.
హనుమంతుడు రాముని కోర్కెపై అతని ముద్రిక తెచ్చుటకు బ్రహ్మలోకమునకు వెడలి ముద్రిక నీయననిన బ్రహ్మపై కోపించి విశ్వరూపము చూపెను. ఆ విశ్వరూపముజూచి బ్రహ్మలోకమంతయు నడలగా బ్రహ్మ ముద్రిక నిచ్చెను. దానిని సీతారాముల కందించి సంతోషపరచెను. అప్పుడు ప్రస్తావవశమున బ్రహ్మలోకము తనకు మిక్కిలి ఆనందము కల్గించినట్లు తెల్పెను. అనేకరీతుల తన కానందము కల్గించిన కారణమున రాముడు హనుమంతునకు బ్రహ్మలోకాధిపత్యము ననుగ్రహించెను. ప్రతికల్పమున ఒక్కొక్క అంశము చొప్పున బ్రహ్మరూప మందుచు భవిష్యత్కల్పముల అతడు బ్రహ్మయగును.
ఆ హనుమంతుని ఆశీర్వాదములు మీఅందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…
ఇట్లు
మీ ఆప్తుడు
అడివి రమేష్ చంద్ర
(Adivi Ramesh Chandra)
M: +91.(984)924-5355
E: admin@jayahanumanji.com
Be First to Comment