శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతమెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత (Parasara Samhita) అలా శరన్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన విద్యలు, ఒకటనేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా
‘పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్’ (19-57)
‘పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి’ (25-23)
[wp_campaign_1]
అని చెప్పుటవలన హనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా (Parasara Samhita) గ్రంధాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహించే ముక్తి నీయగలదని తెలుపబడింది. కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంధాన్ని పూజాగృహంలో ఉంచుకొనుటద్వారా కూడా హనుమంతుని అనుగ్రహహం పొందవచ్చును.
భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగుచూడనిది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగునపడియున్న పరాశరసంహిత (Parasara Samhita) ఒకటి. ప్రతి హనుమద్భక్తుడూ పూనుకొని దీని నింకా ప్రచారంగావించి, హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. శ్రీ ‘పరాశరసంహిత సుప్రసిద్ధ వైదికతంత్ర గ్రంధములలో నగ్రగణ్యమైన’ దని ‘బ్రహ్మవిద్యాలంకార’, ‘తర్క వేదాంత విశారద’, మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు పేర్కోన్నారు.
శ్రీ పరాశర సంహిత (Parasara Samhita) రెండు భాగములుగా ప్రచురితమయినది.
Sri Parasara Samhita Part I – శ్రీ పరాశర సంహిత ప్రధమ భాగము
Sri Parasara Samhita Part II – శ్రీ పరాశర సంహిత ద్వితీయ భాగము
విలువైన శ్రీ పరాశర సంహిత గ్రంధములను పొందుటకు మీరు మా హనుమత్పీఠమును సంప్రదించగలరు.
[wp_campaign_2]
[wp_campaign_3]
Namaste Sastry garu,
I want to buy Parasara Samhitha. Please let me know
if it is in telugu as I don’t know Sanskrit.
Also please let me know the price of the 2 parts of the book.
please reply.
Regards,
Satya