Press "Enter" to skip to content

వినాయక చవితి శుభాకాంక్షలు – సోమవారం 9th September, 2013

ఆధ్యాత్మిక బంధువులందరికీ,

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినమిది. మహాగణాధిపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు. మధ్యాహ్నం చవితి ఉన్న రోజునే “వినాయక చవితి” జరుపుకోవాలి. ఈ ఏడాది సోమవారం – 9th September, 2013 నాడు వినాయక చవితి.

Lord Ganesha

అజం, నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమద్వైత మానంద పూర్ణం |
పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

సకల కార్య ఆరంభములందు నిర్విఘ్న సమాప్తి కొరకు ఇంద్రాదులచేత కూడ పూజింపబడినవాడు విఘ్నేశ్వరుడు. సర్వ విద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడు. ఛందోగణములకు అధిపతి – గణపతి. యోగశాస్త్రరీత్యా – మూలాధార స్థిత ప్రణవాకారం. “త్వం మూలాధారేస్థితోసి” అని శ్రుతివాక్యం.

గజ వదనంతో భక్తుల మనోభీష్టాలన్నిటినీ నెరవేర్చే వరదామూర్తి. సకల మానవుల, దేవ, యక్ష, గంధర్వ, సిధ్ధసాధ్యుల విఘ్నాలను నివారించే దివ్యమూర్తి – గజాననుడు.

ఆ భగవంతుని ఆశీర్వాదములు మీఅందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…

ఇట్లు
మీ ఆప్తుడు
అడివి రమేష్ చంద్ర
(Adivi Ramesh Chandra)
M: +91.(984)924-5355
E: admin@jayahanumanji.com

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: