స్నానము చేయకుండా,చేసెడు పుణ్యకర్మలన్నియును నిష్పలములగును. అట్టి పుణ్యఫలములన రాక్షసులు గ్రహించెదరు అని శాస్త్రవచనము. ప్రాతఃకాలమునందు స్నానము చేసినమీదట మనుష్యుడు శుచిగా అగును. కావున సంధ్యా, జప, పూజా పారాయణాదులగు సమస్త కర్మలు చేయుటకు యోగ్యుడగును. అందువలన ప్రాతఃస్నానము ప్రశంసింపబడింది. ప్రాతఃస్నానము చేయువానివద్దకు దుష్టములు (భూత-ప్రేతాదులు) చేరవు. ఉదయస్నానము దృష్టఫలమగు శరీర శుభ్రతను, ఇహలోక సౌఖ్యమును, అదృష్టఫలమగు పాపనాశము, పుణ్యప్రాప్తిని, పరలోక సౌఖ్యమును కలుగజేయును. ప్రాతఃస్నానము చేయనివాడు సంధ్యావందన జపహోమాది కర్మలను ఆచరించుటకు అర్హుడు కాడు. కావున ఉదయమే స్నానము చేయవలయును.
You can also view the above video here: http://youtu.be/mEUW_Q4vLks
You can also view the above video here: http://youtu.be/43_AkzkEaTg
You can also view the above video here: http://youtu.be/7MA2JCmxFeM
You can also view the above video here: http://youtu.be/ewZo2_nprEY
Be First to Comment