ఆత్మీయ బంధువులారా!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను “శ్రీరామ” విజయనామ సహితంగా జపిద్దాం. ప్రతిరోజూ “శ్రీరామ జయరామ జయజయరామ” విజయనామాన్ని హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు, ముగింపున 108 సార్లు జపించాలి.
ఈవిధంగా పఠించటము విద్యార్థులకు విద్యలో విజయం అందిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఆటంకాలు తొలగించి సంపదలను పెంపొందిస్తుంది. ఉద్యోగులకు సమస్యలు, చికాకులు తొలగించి కార్యసిధ్ది కలుగిస్తుంది. మహిళలకు ఆత్మరక్షణ కలుగజేస్తుంది. కుటుంబంలో అన్యోన్యతను పెంపొందిస్తుంది. నాయకులకు నాయకత్వ లక్షణాలను పెంపొందించి, అఖండ విజయాన్ని అందింస్తుంది. రైతులకు, కార్మికులకు శక్తిని, బలాన్ని ప్రసాదించి సంపాదించి సంపూర్ణ ఫలాన్ని అనుగ్రహిస్తుంది. సమాజంలో వ్యాధి, రోగ, భయ, శత్రు బాధలను తొలగించి సుఖశాంతులను వృధ్ధి చేస్తుంది.
గృహంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, వృత్తి వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నా, పఠించి, మన జీవితాలలో, మన కుటుంబములో, మన గ్రామములో, మన రాష్ట్రములో, మన దేశములో, మన విశ్వములో సుఖశాంతులను వృధ్ది చేయటానికి కృషి చేద్దాము.
శ్రీరామ జయరామ జయజయరామ!
శ్రీరామ శరణం మమ. శుభం భూయాత్.
Be First to Comment