Press "Enter" to skip to content

19th Sep, 2012 – బుధ వారము – వినాయక చవితి

Ganesh Chaturthi

ఆత్మీయ బంధువులారా!

వినాయక చవితి శుభాకాంక్షలు.

ఈ రోజు, 19-9-2012, భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి.

ఈ రోజు గణపతిని ఆయనకి ఇష్టమైన 21 రకాల ఆకులతో విశేషించి గరికతో పూజ చేసి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, పళ్ళు నివేదన చేయాలి. వ్రత కథ చదివి అక్షతలు శిరస్సున ధరించాలి. పూజలో వాడవలసిన 21 రకాల పత్రినే పద్దతిగా వాడాలి. సంతలో ఎవో కొన్ని పిచ్చి ఆకులు కట్టి అమ్ముతారు. అవన్నీ వేయటం తగదు. ఎమైనా లోపిస్తే వానికి బదులు ఉన్న రకాన్నే వాడటం లేదా అక్షతలను వేస్తూ ఫలానా దానికి ఫలానాది వేస్తున్నం అని చెప్పుకోవాలి. పత్రి 21 రకాలకు వాడుకలోని పేర్లు…..
1. మాచిపత్రి 2. వాకుడు 3. మారేడు 4. గరిక 5. ఉమ్మెత్త 6. రేగు 7. ఉత్తరేణి 8. తులసి 9. మామిడి 10. గన్నేరు 11. విష్ణుక్రాంత 12. దానిమ్మ 13. దేవదారు 14. మరువం 15. వావిలి 16. సన్నజాజి 17. తీగె గరిక 18. జమ్మి 19. రావి 20. మద్ది 21. జిల్లేడు.

ఈ 21 పత్రులు అనేక రోగాలు పోగొట్టగల శక్తి కలవి. వీటిని నదులు, చెరువులందు కలుపుట వలన వర్షాకాలపు మురికి, కొత్త నీటి కాలుష్యాన్ని పోగొడతాయి. దూర్వారయుగ్మం అంటే  గరిక. వినాయకుడు ఎలుకను వాహనంగా చేసుకొని ‘అనింద్యుడు’ అని పేరు పెట్టాడు. గడ్డి కూడా పూజార్హమే అని గరిక పూజ చేయించుకుంటున్నాడు. గుంజిళ్ళు తీయటం కూడా ఆయనకి ఇష్టమైన పని.

గణాధిపతి అనుగ్రహప్రాప్తిరస్తు.

One Comment

  1. santosh anumari santosh anumari September 27, 2012

    నకు పరశర సమ్హిత గ్రన్ధమ కవలి, దయచేసి నకు ఏక్కద ఓరుకుతున్దో చేపమన్ద్ది.

    థన్క్స్
    సన్తోశ్
    ౮౮౮౬౯౭౭౭౩౭

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: