Press "Enter" to skip to content

16th July, 2012 – సోమ వారము – కటక సంక్రమణం – దక్షిణాయన పుణ్యకాలం

Surya Bhagwan

ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.

జూలై 16, 2012న కటక సంక్రమణం. ఆనగా దక్షిణాయన పుణ్య కాలం. సూర్యుడు కర్కాటక రాశిలొ ప్రవేశిస్తాడు. నేటి రాత్రి నుండి దక్షిణాయనం. కాబట్టి సంధ్యావందన, పూజా సంకల్పాలలొ ఇక పిదప ‘దక్షిణాయనే’ అని చెప్పాలి. సూర్యుడు మేషం, వృషభం ఇలా ఆయా రాసులలొ ప్రవేశించే సమయం సంక్రాంతి సమయం. అలా మొత్తం 12 సంక్రాంతులు ఉంటాయి.

అన్ని సంక్రమణ సమయాలూ పుణ్య కాలాలే. కాని మిగిలిన మేషాది సంక్రాంతుల కంటె ఈ కటక సంక్రమణ కాలం విశేషమైనది. దీని కంటే మకర సంక్రమణ కాలం మరీ విశేషమైనది. సంక్రమణ సమయములొ స్నాన, దానాలు చెయాలి. తండ్రి లేని వారు పితృదేవతలకు తిల తర్పణాలు వదలాలి. కర్కాటక సంక్రమణం రోజున వరాహ స్వామి పూజ, ఉపవాసం కర్తవ్యాలు. సంక్రమణం రాత్రి 8.45 గం. కి జరుగుతోంది. కావున శిష్టాచారం పాటింపదలచిన వారు అప్పుడే స్నానం చేయటం మేలు. సామాన్యులు మరుసటి రోజు ఉదయం సంక్రమణ స్నానం చేయవచ్చు. సంక్రమణ తిల తర్పణాలు 17 వ తేదీనే చేయాలి. తిల తర్పనలు ఇచ్చిన రోజు శుచిగా ఒంటి పూట భోజనం చేయాలి. అందరికీ కటక సంక్రమణ శుభాకాంక్షలు. శుభం భూయాత్.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: