ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ఆనాడు ఎవరికివారు తమ గురువును పూజించాలి. వేదవిభజనము ద్వారా, పురాణ వాంగ్మయము ద్వారా మనకు అనంత విజ్ఞానమును అందించినవాడు వ్యాస భగవానుడు. కావున గురువుగా ఆయనను పూజించుట సంప్రదాయము అయ్యింది. ప్రతివారికి తొలిగురువు తల్లి, అనంతరము తండ్రి. వారికి నమస్కరించటము, పూజించటము నాటి కర్తవ్యము.
గురువు అంటే అక్షరాభ్యాసమునాటి నుండి వందలమంది ఉంటారు కదా! ఎవరిని పూజించాలి అనేది కొందరి సందేహము. వాళ్ళ జీతాలకోసం కాక, మన జీవితంకోసం మనకు విద్యనేర్పినట్టి, మన జన్మ చరితార్థతకు కారణమైన విద్యనేర్పినట్టి, మంత్రోపదేశము కావించినట్టి, విశేషించి మన మనస్సు గురుభావము ఎవరియందు నిలుపుతున్నదో అట్టి వారిని గురువుగా పూజించాలి లేదా సత్కరించాలి. “నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం” అని గురుపరంపరను మనఃస్ఫూర్తిగా స్మరించుకొనాలి. స్వస్తి.
పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
http://www.samputi.com/launch.php?m=home&l=te