హనుమత్ భక్తులారా,
హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఈఏడాది జూన్ 3వ తేది హనుమజ్జయంతి.
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.
లోకానుగ్రహకాంక్షతో, రాక్షస సంహారార్థము హనుమంతు డుదయించెను. కేసరి భార్యయగు అంజనాదేవికి ఫలరూపమున అగ్ని, వాయువుల సహాయమున అందిన శివతేజస్సువలన అతడు జన్మించెను. కావున హనుమంతుడు కేసరినందనుడు, ఆంజనేయుడు, అగ్నిపుత్రుడు, పవనసుతుడు, శంకర తనయుడు అని కీర్తింపబడుచున్నాడు.
ప్రసన్నాంజనేయ, వీరాంజనేయ, అభయాంజనేయ, పంచముఖాంజనేయాద్యవతారములు అనేకము లున్నవి. అందు ముఖ్యములైన తొమ్మిది ఆయా భక్తులచే ఆరాధింపబడినవి. వానిని నవావతారము లందురు. 1. ప్రసన్నాంజనేయావతారము 2. వీరాంజనేయావతారము 3. వింశతిభుజాంజనేయావతారము 4. పంచముఖాంజనేయావతారము 5.అష్టాదశభుజాంజనేయావతారము 6. సువర్చలాంజనేయావతారము 7. చతుర్భుజాంజనేయావతారము 8. ద్వాత్రింశద్భుజాంజనేయావతారము 9. వానరాకార ఆంజనేయావతారము
హనుమజ్జయంతి సందర్భముగా ఈనాడు ఆదివారం వార్తాపత్రిక (2nd June, 2013) యందు ప్రచురించబడిన శ్రీగురువుగారి “హనుమంతుడు పెళ్ళైన బ్రహ్మచారి” articleని మీరు చదువవచ్చును.
ఆ భగవంతుని ఆశీర్వాదములు మీఅందరి మీద సదా ఉండాలని ప్రార్థిస్తూ…
Be First to Comment