గోమాత
గోవు వలన ప్రయోజనాలుః ఆవు మనకు అనేక విధాల ప్రయోజనకారి.
ఆవుపాలుః పసిపిల్లలకు తల్లిపాలు అమృతసమాలు. తల్లిపాల తరువాత వారికి శ్రేష్టమైనవి ఆవుపాలే. తల్లిపాలు కొరవడిన పిల్లలకు ఆవుపాలు పట్టటమే సర్వవిధాల శ్రేయస్కరం. పసితనం దాటినా అట్టి తల్లిపాల అమృతఫలాన్ని అన్ని విధాలా పొందగల్గుటకు మార్గం గోమాతపాలు త్రాగటమే. కాబట్టే ‘గావః విశ్వస్య మాతరః’ గోవులు ప్రపంచజను లందరకూ తల్లులు అని వేదం చెప్పింది. ‘దేని లాభాలు లెక్కించలేమో అది గోవు’ అని యజుర్వేదం చెప్పింది. తల్లిపాలలోని గుణాలు, ఇంకా విశిష్టగుణాలుకూడా ఆవుపాలలో ఉన్నాయి. అందుకే పిల్ల, పెద్దలందరకూ అవి స్వీకరింపదగినవి. ఆవుపాలు సమశీతోష్ణంగా ఉంటాయి. మధురంగా ఉంటాయి.