గోమాత విశిష్టత
ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది. మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.