శ్రీ రామ
జయ హనుమాన్
శ్లో|| హనుమాన్ కల్పవృక్షో మే – హనుమాన్ మమ కామధుక్
చింతామణి స్తు హనుమాన్ – కో విచారః? కుతో భయమ్?
శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఎట్టి విచారము, భయము ఉండదు. “దేవో భూత్వా దేవం యజేత” అన్నారు. ఏ దేవుని అనుష్టింపదలచినవారు ఆ దేవతతో తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ఆ దేవుని పరిపూర్ణానుగ్రహం పొందగల్గుతారు. అందుకు అనువైన మార్గం దీక్ష. “సర్వం హనుమన్మయం జగత్” జగమంతా జీవనమంతా హనుమన్మయంగా దీక్షాకాలంలో ఉండి హనుమంతునితో మనం తాదాత్మ్యం పొంద గల్గుతాము. అట్టి తాదాత్మ్యత దీక్షానంతర కాలమందు కూడ