శ్రీరామ
జయ హనుమాన్
ఒకప్పుడు ఈ దేశంలో శైవమతం, వైష్ణవమతాల మధ్య భయంకరమయిన యుద్ధాలు జరిగాయి. ఆ ద్వేషభావాన్ని తొలగించటానికి మహనీయులెందరో యత్నించారు.
శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః, విష్ణో శ్చ హృదయం శివః
‘యధా శివమయో విష్ణుః, ఏవం విష్ణుమయ శ్శివః’ అనే సూక్తిని ఎలుగెత్తి చాటారు. అంటే విష్ణుస్వరూపుడైన శివుడికీ, శివస్వరూపుడయిన విష్ణువుకూ నమస్కరిస్తున్నాననీ; శివస్వరూపుడయిన విష్ణువూ, విష్ణువు హృదయమే శివుడూ అని; విష్ణువు శివమయుడని, అట్లే శివుడు విష్ణువుతో నిండినవాడని అర్థం. వారిమధ్య భేదం చూడనంత వరకే మనకు మేలని కూడా చెప్పబడింది.