Press "Enter" to skip to content

Posts published in “Cow – గోమాత విశిష్టత”

గోమాత విశిష్టత 9 – గోహత్యా నిషేధోద్యమం

గోమాత విశిష్టత – గోహత్యా నిషేధోద్యమం

Indian Cow

ఎంతో విశిష్టత, ఎన్నో ప్రయోజనాలు కల్గినగోవు నేడు మన అజ్ఞానకారణంగా ఎంతో ప్రమాదంలో పడింది. ‘మృత్యుగృహ ద్వారంవద్ద గోవు నిలబడి ఉంది. దాన్ని రక్షించగలమో లేదో కానీ గోవుతోబాటు మనము, మన సభ్యత నష్టపోవటం మటుకు ఖాయం అన్నారు గాంధీజీ. నిజంగానే మనం గోవును రక్షించలేకపోతూ అన్నివిధాలా నష్టపోతున్నాం. ఈస్టిండియాకంపెనీ వారు హిందూరాజులతోది సంధిపత్రాలలో ‘గోవధ చేయము’ అనే షరతు స్పష్టంగా వ్రాశారు. కానీ గోవధ ప్రారంభించటంతో 1857 ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామం తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ‘భారతదేశాన్ని స్థిరంగా నిలబెడుతున్న విశేషా లేమిటో తెలిసికొని వాటికి విరుగుడు సూచించా’లని ఒక కమిటీని వేసింది. అది తన రిపోర్టులో 1. ధార్మికత్వం, 2. సమాజంలోని పంచాయతీ వ్యవస్థ 3. గోవు కేంద్రంగా ఉన్న వ్యవస్థ అని మూడు కారణాలు తేల్చింది.

గోమాత విశిష్టత 8 – వైద్య ప్రయోజనాలు, సాధించే విధానాలు

గోమాత విశిష్టత

Gomatha - Indian Cow

ఆవుపాలతో అల్లపురసం, తేనెలు సమంగా కలిపి 3 ఔన్సులు ఉదయం మాత్రం పుచ్చుకొనడంవల్ల మంచి ఆకలి కలుగుతుంది.  మినపపప్పు నేతితో వేయించి చూర్ణం చేసి ఆవుపాలలో పంచదార కలిపి వండించి పరమాన్నం చేసి వాడితే ఇంద్రియ పుష్టి కలుగుతుంది. రెడ్డివారినానుబాలు రసంతీసి పిప్పళ్ళు తగుమాత్రం ఆ రసంలో నానేసి తీసి ఎండించి ఇలా 5 మార్లు చేశాక దాన్ని చూర్ణంచేసి పంచదార కలిపి పూటకొక తులం పుచ్చుకొంటూ ఆవుపాలు తాగితే ఇంద్రియం గట్టిపడుతుంది. ఆకాలంలో పుష్టికర ఆహారం తీసికొనాలి. వేపకట్టె బొగ్గు అరతులం, మంచి గంధపుచెక్క అరతులం, బెల్లం అరతులం చూర్ణంచేసి పేరుకొన్న ఆవునేతితో పుచ్చుకొంటే ఉబ్బసపు దగ్గు తగ్గుతుంది. ఆవుపాలతో కలబంద గుజ్జు, మిరియాలపొడి, పంచదార కలిపి పుచ్చుకొన్న ఉబ్బసం తగ్గుతుంది. తొమ్మిది ఔన్సుల ఆవుపెరుగులో మూడు చుక్కల కాకరాకు చుక్కల కాకరాకు పసరువేసి ఉదయంమాత్రం త్రాగితే ఉబ్బుకామెర్లు తగ్గుతాయి. పథ్యనియమంకూడా లేదు.

గోమాత విశిష్టత 7 – వ్యవసాయంలో గోవు, గోసంతతి ప్రయోజనం, ప్రాముఖ్యత

గోమాత విశిష్టత

Indian Cows in Agriculture

చాలా ముఖ్య విషయ మేమంటే ప్రఖ్యాత విజ్ఞానశాస్త్రవేత్త డా. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1948 లో మన దేశానికి వచ్చే డా. అమర్ నాధ్ ఝా అనే విద్యవేత్త ద్వారా ఒక సందేశం పంపారు. అది ‘భారతదేశంలో ట్రాక్టర్లవంటి యంత్రాలద్వారా నడిచే వ్యవసాయాన్ని అమలుచేయవద్దు. 400 సంవత్సరాలపాటు యంత్రాలద్వారా వ్యవసాయం చేయడంవల్ల అమెరికాదేశపు వ్యవసాయభూమి నిస్సారమైపోయింది. 10వేల సంత్సరాలపైగా వ్యవసాయం సాగుచున్న భారతదేశపు మట్టిలో సారం, శక్తీ ఇప్పటికీ తరిగిపోలేదు’ అన్నారు. యంత్రములద్వారాకాక గోసంతతిద్వారా వ్యవసాయం చేయటంలోని ప్రయోజనం ఆ శాస్త్రవేత్త సందేశంద్వారా అయినా గ్రహింపక గోసంతతిని నాశనం చేసికొని వినాశందిశగా పరుగులెత్తుతున్నాం. రసాయనిక వనరులతో సాగుతున్న వ్యవసాయం భోజనవిధానాన్ని కుంచింపజేసింది. తత్ఫలితమే ఈనాటి ప్రమాదకరమైన రోగాలు, వాతావరణ కాలుష్యాలు. అందుకే సర్ హోవర్ట్ ‘యంత్రాలద్వారా సాగే వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమినాశకమందులు తప్పనిసరి అవుతాయి. యంత్రాలద్వారా జరిగే వ్యవసాయపు టెక్నాలజీ భయంకరమైన వాతావరణకాలుష్యాన్ని వ్యాప్తంజేస్తుంది. అనర్థాలకు ఆలవాలమైన యాంత్రిక వ్యవసాయాన్ని వైజ్ఞానికం అనటం తప్పు’ అన్నారు. పంట దిగుబడి యాంత్రిక, రసాయనిక వ్యవసాయం వలననే పెరిగిన దనుకొనటం భ్రాంతి. పరిశోధనాత్మక కృషితో దేశీయ విధానంలోను వ్యవసాయంచేసి ప్రమాదకరమైన రోగాలకు నిలయంకాని మంచి దిగుబడిని సాధింపవచ్చు.

గోమాత విశిష్టత 6 – గోవు ఆరోగ్యకారి మరియు ఆర్థిక ప్రయోజనకారి

గోమాత విశిష్టత

Indian Cow

గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.

గోమాత విశిష్టత 5 – గోవులు ప్రపంచజనులందరకూ తల్లులు

గోమాత

Gomatha

గోవు వలన ప్రయోజనాలుః ఆవు మనకు అనేక విధాల ప్రయోజనకారి.
ఆవుపాలుః పసిపిల్లలకు తల్లిపాలు అమృతసమాలు. తల్లిపాల తరువాత వారికి శ్రేష్టమైనవి ఆవుపాలే. తల్లిపాలు కొరవడిన పిల్లలకు ఆవుపాలు పట్టటమే సర్వవిధాల శ్రేయస్కరం. పసితనం దాటినా అట్టి తల్లిపాల అమృతఫలాన్ని అన్ని విధాలా పొందగల్గుటకు మార్గం గోమాతపాలు త్రాగటమే. కాబట్టే ‘గావః విశ్వస్య మాతరః’ గోవులు ప్రపంచజను లందరకూ తల్లులు అని వేదం చెప్పింది. ‘దేని లాభాలు లెక్కించలేమో అది గోవు’ అని యజుర్వేదం చెప్పింది. తల్లిపాలలోని గుణాలు, ఇంకా విశిష్టగుణాలుకూడా ఆవుపాలలో ఉన్నాయి. అందుకే పిల్ల, పెద్దలందరకూ అవి స్వీకరింపదగినవి. ఆవుపాలు సమశీతోష్ణంగా ఉంటాయి. మధురంగా ఉంటాయి.

గోమాత విశిష్టత 4 – గోవు అగ్నిమయం. అమృతమయం, దేవమయం

గోమాత

Cow

స్మృతులను పరిశీలించినపుడు ‘గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ’ అని 14 లోకాలూ గోవునం దున్నాయని, గోవునందు దేవతలంద రున్నారని పరాశరస్మృత్యాదులు వివరిస్తున్నాయి. బృహత్పరాశరస్మృతి గోదానాది మహిమ 5-34 నుండి 41 వరకు తెల్పింది. ఇంకా ‘గవాం చైవానుగమనం సర్వపాప ప్రణాశనమ్’ అని గురువువలె గోవు ననుసరించిపోవుట సర్వ పాపహరణ మనికూడా పరాశరస్మృతి చెప్పింది. మనుస్మృతి ‘గవా చాన్న మాఘ్రాతం వర్జయేత్సదా’ అని ఆవు వాసనచూచినా దాని నోటినుండి తీసికొనక దానికే వదలాలని, ‘గవాపహారీ గోధా జాయతే’ అంటే గోవు నపహరించినవాడు ఉడుముగా పుడతాడని చెప్పింది. నృగమహారాజుచరిత్ర ఇందుకు ఉదాహరణగా కన్పడుతుంది. శంఖస్మృతి ‘గోఘ్న శ్చాంధో భవేత్’ ఆవును చంపినవాడు అంధుడగునని చెప్తోంది. ‘గోమయాదినా సంస్కృతాయాం భూమౌ భుంజీత’ అని ఆవుపేడతో శుద్దిచేసినచోట భోజనం చేయమని వ్యాసుడు చెప్పాడు. గోవును కొట్టుట, తన్నుటల వలన మహాపాపం ప్రాప్తిస్తుందనీ స్మృతులు తెల్పాయి.

గోమాత విశిష్టత – 3

గోమాత

Cow

ఇలాగే యజుర్వేదం (23-48) లో ‘బ్రహ్మా సూర్యసమం జ్యోతిః’ మంత్రంలో ‘గోస్తు మాత్రా న విద్యతే’ అని గోవునకు సమమైనది లేదని తెలుపబడింది. ‘గాం సీమాహిం రదితం విరాజమ్’ అని గోహింసను నిషేధిస్తోంది. ‘అంతకాయ గోఘాతమ్’ అని గోహంతకులను హతమార్చ మనికూడా యజుర్వేదం చెప్పింది. గోవధ అంతటి పాపమని గ్రహించాలి. అంతేకాదు ‘క్షుధేయాగాం విక్రేతం తం భిక్షమాణ ఉదితిష్టాశినమ్’ ని వేదం గోహంతకుడు భిక్షకై వచ్చినా భిక్ష పెట్టవద్దని, వానికి మరణమే శిక్ష ని చెప్తోంది.

గోమాత విశిష్టత – 2

గోమాత

Cows
పంజాబ్ విశ్వవిద్యాలయం వారొక ప్రయోగం చేశారు. కొన్ని ఆవులు, కొన్ని గేదెలకు లెక్కప్రకారం కొంత మేతలో DDT కల్పి తినిపించారు. కొద్దిరోజుల తరువాత ఆ అవుల పాలలో 5% మాత్రమే DDT అంశాలుండగా ఆ గేదెల పాలలో 12% DDT ఉంది. DDT కల్పిన నీటితో గేదెల్ని కడిగినా వాటి పాలలో DDT అంశం ఉన్నట్లు తేలింది. ఆవులందు అలాకానరాలేదు. ఆవుపేడ, మూత్రములందున్న ఔషధగుణాలు, దివ్యశక్తి గేదెపేడ, మూత్రము లందు లేవు.

గోమాత విశిష్టత – 1

గోమాత

Cow
గోసంరక్షణ హిందూధర్మంలో ప్రధానాంశం. ‘మానవ వికాసక్రమంలో గోరక్షణ అన్నిటికన్నా మిన్నయైన అలౌకిక విషయంగా నాకు తోస్తున్నది’ అంటారు గాంధీజీ. మన సంప్రదాయం గోవుకు సమున్నతస్థాన మిచ్చింది. ఒకవిధంగా ఆలోచిస్తే గోవు ప్రతి పుణ్యకార్యానికి అవసరమే. గోవు మన సంప్రదాయంతో అవిభాజ్యసంబంధం కల్గి ఉంది. గోవును తీసేస్తే మన సంప్రదాయం లేనట్లే అని చెప్పాలి. శివుని వాహనమైన నంది గోసంతతి. అది లేని శివాలయం లేదు. గోక్షీరం లేనిదే శివాభిషేకం కాదు. విభూది నిర్మాణం ఆవుపేడతోనే చేయ్యాలి. కావున శైవసంప్రదాయాన గోవు అవిభాజ్యం. గోపాలబాలకృష్ణుడు లేని వైష్ణవము లేదుకదా! సంక్రాంతి పండుగరోజులు పంటలువచ్చిన సుఖప్రదమైన కాలం. గంగిరెద్దులను గౌరవిస్తూ మనం ఆసుఖాలకు నోచు కొంటాము. గోమయం లక్ష్మీస్థానం.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: