ఫిబ్రవరి 4, 2014 నాడు శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరము, దిల్ షుఖ్ నగర్, హైదరాబాద్ నందు సాయంత్రము 6 గంటలకు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారికి శ్రీ పళ్ళె నరసింహాచార్యులు చేతుల మీదుగా…
Posts published in “Sri Guru Prakashanam – గురు ప్రకాశనము”
ఓం శ్రీరామ
జయహనుమాన్
(శుక్రవారం 15th July, 2011 – వ్యాస (గురు) పూజ సందర్భమున ప్రత్యేకం)
గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు శిరసువంచి నమస్కరిస్తూ…
గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక
సంపాదకీయం
నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.