శ్రీ పరాశర సంహితను (Sri Parasara Samhita) విశ్వవ్యాప్తం చేయటంకోసం నాగర్లిపిలో ముద్రించాను. ఆనాడు సంహితపై తమ అమూల్యాభిప్రాయం ప్రసాదించిన కుర్తాళం పీఠాధిపతులు శ్రీశివచిదానందభారతీస్వామివారికి, నా సంహితకృషి నాశీర్వదించిన దత్తపీఠాధిపతులు శ్రీగణపతిసచ్చిదానందస్వామివారికి కృతజ్ఞతాపూర్వాంజలి ఘటించుచున్నాను.
Posts published in “Books”
గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక
సంపాదకీయం
నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.
శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతమెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత (Parasara Samhita) అలా శరన్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన విద్యలు, ఒకటనేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా
‘పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్’ (19-57)
‘పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి’ (25-23)