Press "Enter" to skip to content

Posts published in “Downloads”

Sri Hanuma Janmasthala Samuddharanodyamam

OM SRI RAMA
JAYA HANUMAN
Sri Hanuma Janmasthala Samuddharanodyamam
(Movement for grand restoration of birth place of Sri Hanuman)
“An appeal to the ardent, pious and dedicated devotees of Sri Hanuman”

Anjanaadri

We have been truly believing that “SRI RAMACHANDRA” was born in “AYODHYA” and therefore the people in that area are the divinely blessed ones. But, even though in our great “PURANAS” it is clearly and unambiguously made known to us that “SRI HANUMAN” who proved  himself an efficient, skilful and gifted executor of “SRI RAMACHANDRA’S” assignments, was born on the “ANJANADRI HILL”in the vicinity of TIRUMALA-TIRUPATI in Andhra Pradesh, we are not yet considering ourselves as the blessed ones. In fact many people do not know this truth at all. For this unawareness we ourselves, the devotees of “SRI HANUMAN”, are responsible.

శ్రీ దుర్గా అమ్మవారి ఆలయస్థాపనలో శ్రీ బీరక శివప్రసాదరావు గారి దివ్యానుభూతులు

శ్రీశ్రీశ్రీ జ్యోతిర్మయి దుర్గాదేవి అమ్మవారు
దేవాంగపురి, చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్

Sri Durga Ammavaru

Sri Hanumath Deeksha – శ్రీ హనుమాన్ దీక్ష

Sri Hanumath Deeksha 01

శ్రీ రామ
జయ హనుమాన్

శ్లో|| హనుమాన్ కల్పవృక్షో మే – హనుమాన్ మమ కామధుక్
చింతామణి స్తు హనుమాన్ – కో విచారః? కుతో భయమ్?

శ్రీ హనుమంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వంటివాడు. ఆయనను ఆశ్రయించిన వారికి ఎట్టి విచారము, భయము ఉండదు. “దేవో భూత్వా దేవం యజేత” అన్నారు. ఏ దేవుని అనుష్టింపదలచినవారు ఆ దేవతతో తాదాత్మ్యం పొందాలి. అప్పుడే ఆ దేవుని పరిపూర్ణానుగ్రహం పొందగల్గుతారు. అందుకు అనువైన మార్గం దీక్ష. “సర్వం హనుమన్మయం జగత్” జగమంతా జీవనమంతా హనుమన్మయంగా దీక్షాకాలంలో ఉండి హనుమంతునితో మనం తాదాత్మ్యం పొంద గల్గుతాము. అట్టి తాదాత్మ్యత దీక్షానంతర కాలమందు కూడ

Vedalalo Hanumantudu – వేదాలలో హనుమంతుడు

Vedalalo Hanumanthudu

శ్రీ రామ
జయ హనుమాన్

‘కనబడేదల్లా నాశనమయ్యేదే’ అంటూ ‘యద్దృశ్యం తన్నశ్యం’ అంటారు. ఇక శాశ్వతము, చిరంతనము అయినదేమిటి? అని ప్రశ్న వేసుకుంటే సమాధానం శూన్యమేనేమో. ‘ఆకాశం గగనం శూన్యం’ అని అన్నారు కాబట్టి అన్నీ నాశనమైన పిదప మిగిలేశూన్యం ఆకాశమే. తార్కికులు ‘శబ్దగుణక మాకాశం’ అని అనటంవల్ల ఆ ఆకాశంద్వారా శబ్దమనే గుణంమాత్రం ఆకాశ మున్నంతకాలం ఉంటుంది. ఆశబ్దమే శ్రుతి. అందువలననే శ్రుతి చిరంతరం, సర్వప్రమణంకూడా. ఆశ్రుతి అనబడు వేదం మనకు

Sri Hanumath Shatakam – శ్రీ హనుమచ్చతకము (చిత్ర కవిత్వము)

Sri Hanumath Shatakam

శ్రీ రామ
జయ హనుమాన్

కృతజ్ఞతలు

డా. కె.వి.కె.సంస్కృత కళాశాల, గుంటూరు విద్యార్థిగా ఉన్న దశలో వ్రాసిన దీశతకం. శ్రీ హనుమంతుని దయవలన నాకు హైస్కూలులో చదువుకునే రోజులలోనే ఛందోబద్ధమైన కవిత్వం అబ్బింది. ఉద్యోగిగా ఆరంభ దశలో సంఘ సేవానిరతుడనయి, అనంతరం ఆధ్యాత్మిక మార్గ గతుడనయి, కవితా మార్గము నుపేక్షించినాను. శ్రీ హనుమంతుడు నాచే ఏది చేయింపదలచినా దానికే నేను సిద్ధమై ఉన్నాను.

హనుమత్సేవలో చాలా సాహిత్యం వెలువరించాను.

Sri Hanumadvrata Vidhanam – శ్రీ హనుమద్వ్రత విధానము

శ్రీ హనుమంతుని సేవ నాకు ఆ బాల్యంగా లభ్యమయింది. మా తల్లిగారి ప్రోత్సాహం నాలొ ఆధ్యాత్మికత పెంపొందించింది. 1971లొ గురుదేవుల అనుగ్రహం సమకూడి ప్రయోజనకరమైన కృషి ఆరంభమయింది. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ…

Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్

హనుమత్సేవలో తులసీదాస్

హనుమంతుని త్రికరణశుధ్ధిగా సేవించువారి జన్మ ధన్యమనుటకొక చక్కని ఉదాహరణ తులసీదాస్ జీవితం. పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన వానిని మూలానక్షత్ర జాతకుడు, నష్టజాతకుడని, కుటుంబానికి అరిష్టమని తండ్రి వదిలేశాడు. చేరదీసిన దాదికూడా చిన్నతనంలోనే చనిపోవటంతో అతణ్ణి దగ్గరకు తీయటానికే అందరూ వెరచేవారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు భగవదనుగ్రహంతో పెరిగాడు.

ఏ విధమైన కష్టములనున్న వారయినా దీనిని పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులై పీడావిమోచనము పొందవచ్చును.

Guru Prakashanam – గురు ప్రకాశనము

గురు ప్రకాశనము
30-5-2009 నాటి డా. అన్నదానం చిదంబర శాస్త్రి గారి షష్టిపూర్తి సందర్భంగా ప్రత్యేక సంచిక

సంపాదకీయం

నేను శ్రీపరాశర సంహితపై (Parasara Samhita) పరిశోధన చేస్తున్నాను. అందులో ఒక ప్రత్యేకాంశం గురువిషయమం. ఆ అంశంపై పరిశీలిస్తున్న సమయంలో పరాశరమహర్షి చెప్పిన ఒక మంచి వాక్యం నాదృష్టికి వచ్చింది. అది నాకు నచ్చింది. అది “గురుం ప్రకాశయే ద్దీమాన్ – మంత్రం యత్నేన గోపయేత్” అనేది. అటువంటి గురుప్రకాశనం చేసికొని ఋషివాక్యాన్ని సార్థకం చేయాలనిపించింది. దేనికయినా సమయం, సందర్భం ఉండాలికదా! మా నాన్నగారి షష్టిపూర్తి సమయంలో ఆ నా లక్ష్యం పూర్తిచేసికొనా లనుకున్నాను. ముందుగా నా అభిప్రాయం మా నాన్నగారితో చెప్పాను. మనమెంతవాళ్లం? అంటూనే గురుప్రకాశనం శిష్యులహక్కు. దానిని కాదనే హక్కు నాకు లేదు. మీయిష్టం అన్నారు.

Mission News Theme by Compete Themes.
Marquee Powered By Know How Media.
error: