గోమాత విశిష్టత
గోమూత్రం – ఇది కఫము నణచునది, జీర్ణశక్తి పెంచునది, కుష్టు, ఉబ్బు, పాండువు, గుర్మం శూల, శ్వాస, కాస, మూత్రకృచ్చం, మూలవ్యాధి, జ్వరము, జఠరొగాలు, వాతం, క్రిమిరోగం వంటివానికిది ఔషధం. మలబధ్ధకాన్ని తొలగించటం, దీర్ఘరోగ నివారణం చేస్తుంది. పుడిసెడు మొదలు దోసెడు దాకా ఉదయంపూట లోపలకు పుచ్చుకొను విధానం. గోమూత్రంవల్ల ఎన్నో వ్యాధులు నయమౌతాయని సుష్రుతుడు చెప్పాడు. గోమూత్ర పురీషాలు లోపలకు పుచ్చుకొనటంవల్ల దేహానికి గల అనారోగ్యాలు దూరమౌతాయని యూరప్ దేశస్థులు పరిశోధనచేసి గ్రహించారని, ఆచరించి సత్ఫలితాలు పొందారని సుప్రసిధ్ధ పాశ్చాత్య వైద్యులు డా. మైకేల్ తాను వ్రాసిన హ్యాండ్ బుక్ ఆఫ్ బార్టియాలజీ గ్రంధం 45వపుటలో వ్రాశారు. గోమూత్రం ఎరువులలో బాగా ఉపకరిస్తుంది.