స్నానము చేయకుండా,చేసెడు పుణ్యకర్మలన్నియును నిష్పలములగును. అట్టి పుణ్యఫలములన రాక్షసులు గ్రహించెదరు అని శాస్త్రవచనము. ప్రాతఃకాలమునందు స్నానము చేసినమీదట మనుష్యుడు శుచిగా అగును. కావున సంధ్యా, జప, పూజా పారాయణాదులగు సమస్త కర్మలు చేయుటకు యోగ్యుడగును.…
Jaya Hanumanji | జయహనుమాన్ జీ
ఆత్మీయ బంధువులారా!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
వేలసంవత్సరాలక్రితం మనిషిగా అయోధ్యలో అవతరించి, మానవత్వపు విలువలను ఆచరణ ద్వారా లోకానికి చాటిన ఆరాధ్యదైవం శ్రీరాముడు. శ్రీ విజయ నామ సంవత్సరమునందు వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భముగా, మనమందరము హనుమాన్ చాలీసాను “శ్రీరామ” విజయనామ సహితంగా జపిద్దాం. ప్రతిరోజూ “శ్రీరామ జయరామ జయజయరామ” విజయనామాన్ని హనుమాన్ చాలీసాకు ముందు 108 సార్లు, ముగింపున 108 సార్లు జపించాలి.
ఉదయనిద్ర లేచింది మొదలు మరల రాత్రి నిద్రపోయేదాకా మనం ఏది ఎలా ఆచరించాలో, ఎందుకు ఆచరించాలో సశాస్త్రీయముగా పరిశోధనాత్మక అంశాలతో వివరించేదే ఈ సదాచారం. మనుష్యుని పశుత్వం దిశగా పోనీక, దైవత్వంవైపు నడిపించేదే ఈ…
ఆత్మీయ బంధువులారా!
శ్రీ హనుమద్వ్రత శుభాకాంక్షలు.
మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసంయొక్క విశిష్టత ఎట్టిదో అర్థమౌతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. అరటితోటలో హనుమంతునకు పూజచేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం చేకూరుతుంది. అందునా మార్గశీర్షంలో శనివారమునాడు హనుమంతుని కదళీవనమున ఆరాధించి అందే శ్రోత్రియులకు అన్నసమారాధన మొనర్చిన తప్పక అతని నను గ్రహించి సర్వకామ్యము లీడేర్చునని పరాశులవారు చెప్పినారు. ఆ మాసమునందు శుధ్ధత్రయోదశి ప్రధానమైనది.
దీపావళి శుభాకాంక్షలు హనుమత్ స్వరూపులయిన మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ…. ఈ దీపావళి శుభ సందర్భముగా మహాలక్ష్మి అమ్మవారు మీ అందరి జీవితాలలో అనంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,…
ఆత్మీయ బంధువులారా!
వినాయక చవితి శుభాకాంక్షలు.
ఈ రోజు, 19-9-2012, భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి.
శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు శ్రీపరాశర సంహిత గ్రంథ ముద్రణకు సహకరింపగోరగా హనుమద్భక్తితత్పరులై సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గ్రంథములకువలయు సహాయము లభించినందున ప్రథమభాగ ముద్రణ పూర్తి అయినది. త్వరలో…
ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
9th Aug, 2012 నాడు శ్రావణ బహుళ అష్టమి. దీనినే ‘కృష్ణాష్టమి’ అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈరోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాసలీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పటికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెళ్ళలేదు.
ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ది:02-08-2012 నాడు శ్రావణ పౌర్ణమి. దీనినే జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఉపనయనం అయిన ప్రతి వారు ఈ రోజు “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అంటూ, కొత్త జందెమును ధరించి పాత దానిని తీసివేస్తారు. ఆ సంవత్సరమే ఉపనయనం అయిన నూతన వటువునకు ఈ రోజు ‘ముంజ విడుపు’ లేదా ‘ఉపాకర్మ’ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఆధ్యాత్మిక బంధువులకు శుభాకాంక్షలు.
ఈ రోజు వరలక్ష్మీవ్రతము. ఇది స్త్రీలకు సంబంధించిన ముఖ్య వ్రతము. శ్రావణపౌర్ణమికి ముందువచ్చే శుక్రవారమునాడు ఈ వ్రతము చేయాలి. ఆ రోజు ఇబ్బంది ఏర్పడినవారు అనంతర శుక్రవారాల్లో చేసుకోవచ్చు. ఈ రోజు వరలక్ష్మి పూజచేసి, ఆ దేవి అనుగ్రహం సంపాదించుకొంటే, వరలక్ష్మి వరములు ప్రసాదింపగలదని, ధన, కనక, వస్తు, వాహనాదులు లోటులేకుండా అనుగ్రహింపగలదని ప్రతీతి. సువాసినులు, అంటే ముత్తయిదువులు అందరూ ఈవ్రతం చేస్తారు. దీనిద్వారా సౌభాగ్యం పొందగలుగుతారు. దీనిని ప్రత్యేకంగావున్న కల్పమును అనుసరించి నిర్వహించుకొనాలి.